కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్! ప్రయాణికుల తోపులాట!

  • టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్..
  • సికింద్రాబాద్ లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ
  • ప్రయాణికుల మధ్య తోపులాట
దసరా పండగను పురస్కరించుకుని హైదరాబాద్ లో నివసిస్తున్న పలు ప్రాంతాల వాసులు తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణికుల రద్దీ మొదలైనప్పటికి ఈరోజు మరింతగా పెరిగింది. టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు సిద్ధపడ్డారు.

దీంతో, సికింద్రాబాద్ లోని రైల్వేస్టేషన్ కు భారీ సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు. ఈక్రమంలో టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. విపరీతమైన రద్దీ కారణంగా రైల్వేస్టేషన్ లోపలికి ప్రయాణికులు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల మధ్య తోపులాట కారణంగా వారి మధ్యలో మహిళలు ఇరుక్కుపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
secunderabad
Railway station
Passengers
Dassera

More Telugu News